క్రీడల్లో సత్తా చాటాలి
– యువత, విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: యువత, విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ యువసేన ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ ట్రోపీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నిర్వహిస్తున్న కేసీఆర్ క్రికెట్ ట్రోపీ టోర్నమెంట్ ను గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సందర్శించారు. చైర్ పర్సన్ బ్యాటింగ్ చేసి క్రీడాయాలను ఉత్సహా పరిచారు. అనంతరం టోర్నమెంట్ పోటీని ప్రారంభించి క్రీడాకరులకు కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ యువసేన ఆధ్వర్యంలో కేసీఆర్ క్రికెట్ ట్రోపీ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత, విద్యార్థులు క్రికెట్‌తో పాటు వాలీబాల్, పుట్ బాల్, ఖోఖో, కబడ్డీ వంటి తదితర క్రీడల్లో సత్తా చాటాలన్నారు. క్రీడలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగాలన్నారు. క్రీడల్లో తాండూరును రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డి.నర్సింగ్ రావు, నాయకులు గురురాజ్ జోషి, శుభప్రత్ పాటిల్ యువసేన సభ్యులు భాను ప్రసాద్, హరీష్, కుర్వ బాలు, రాము గౌడ్, శ్రీశైలం, విజయ్, నరేష్ గౌడ్, పాష తదితరులు పాల్గొన్నారు.

