సొంత గూటికి చేరిన మాజీ జెడ్పీటీసీ

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంత గూటికి చేరిన మాజీ జెడ్పీటీసీ
– కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చిన ఎం. రాకేష్ మహారాజ్
– ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లాలో తాండూరు నియోజకవర్గంలోని మహరాజుల కుటుంబానికి చెందిన స్వర్గీయ చందు మహరాజ్ తనయుడు, బషీరాబాద్ మాజీ జెడ్పీటీసీ ఎం.రాకేష్‌ మహరాజ్ సొంత గూటికి చేరుకున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన తాజాగా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, తాండూరు ఇంఛార్జి యం రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అద్యక్షులు ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాకేష్ మహరాజ్‌కు జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి కృషి చేయాలని రేవంత్‌ రెడ్డి రాకేష్‌ మహారాజ్‌కు సూచించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్‌ మహరాజ్ మాట్లాడుతూ ఎం. రాకేష్‌ మహారాజ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి, టీపీసీసి ప్రధాన కార్యదర్శి ధార సింగ్, నాయకులు ఉత్తమ్ చంద్, నర్సింహులు, జనార్దన్ రెడ్డి, నార్సి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.