మా జీవితాలలో వెలుగు నింపిన పీపుల్స్ కాలేజీ

తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

మా జీవితాలలో వెలుగు నింపిన పీపుల్స్ కాలేజీ
– 1990 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఉద్వేగం
– నాటి ప్రిన్సిపాల్, లెక్చరర్ల భావోద్వేగం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూర్ పీపుల్స్ కాలేజీ తమ భవిష్యత్ ను బంగారు బాటలో నడిపించిందని ఆ కాలేజీ పూర్వ విద్యార్థులు గుర్తు చేశారు. విలువలతో కూడిన విద్యను అందించి ఉస్మానియా విశ్వ విద్యాలయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నామని అన్నారు. తమకు ఉత్తమ భోధన అందించిన యాజమాన్యం, ఉపన్యాసకులను ఎన్నటికీ మరిచి పోలేమని వ్యాఖనించారు. ఆదివారం పట్టణంలో దుర్గా గ్రాండ్యువర్ హోటల్ లో 1990లో డిగ్రీ పూర్తి చేసుకున్న బీఏ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అప్పటి ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, ఉపన్యాసకులు వి.రంగారావు, వరలక్ష్మి, బ్రిజ్ గోపాల్, తిప్పయ్య, పీడీ రాంచంద్రయ్య, లైబ్రరియన్ నారాయణ, అటెండర్లు, ప్యూన్ లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి తీవ్ర భావొద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అయ్యారు.

నాటి రోజులను నెమరు వేశారు. పూర్వ విద్యార్థులలలో అబ్కారీ శాఖ ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి (రాఘపూర్) మాట్లాడుతూ క్రికెట్ లో ఏడుగురు బ్యాట్స్ మెన్ అవుట్ అయిన తర్వాత టీమ్ ను గెలిపించడంలో ఉండే ఆనందం మధురస్మృతిగా మిగులుతుందన్నారు. తాను కూడా ఇంటర్ ఫెయిలై రెండేళ్లు వ్యవసాయం చేసుకున్నానని, పీపుల్స్లో డిగ్రీ చదివిన తర్వాత యూనివర్సిటీ లో గోల్డ్ మెడల్ సాధించి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించానని, చివరకు ఎక్సయిజ్ శాఖలో ఈ స్థాయికి చేరుకోవడం వెనక లెక్చరర్ల ప్రేరణ కారణమన్నారు. మహావీర్ సింగ్, నాగయ్య, అనర్ సింగ్, సాంబుర్ చంద్రశేఖర్, bantaram విజయ్, నిర్ని చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, సుధాకర్, మంగమ్మ పరిమళ, అనిత, సావిత్ర, పద్మావతి, శకుంతల, శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ మూడు దశబ్దాల తర్వాత తాము కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాలేజీని, ఉపన్యాసకులను మరిచిపోలేమని అన్నారు. అనంతరం మల్లీ కలుసుకుందాని అందరూ ఆప్యాయంగా వీడ్కోలు చెప్పుకున్నారు.