చిన్నోళ్లు కాదు.. చిచ్చర పిడుగులు
– ఇండో శ్రీలంకన్ టోర్నమెంట్లో సహారా క్రీడాకారుల సత్తా
– అండర్ 14 క్రికెట్ పోటీలో అద్భుత గెలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: చూడడానికి చిన్నోళ్లే అయినా చిచ్చర పిడుగులమని నిరూపించారు. తాండూరు సహారా క్రికెట్ అకాడమి క్రీడాకారులు క్రికెట్ పోటీలో సత్తా చాటారు. మహారాష్ట్రలో జరిగిన ఇండో- శ్రీలంకన్ టోర్నమెంట్లో వికారాబాద్ జిల్లా జట్టుకు అద్బుత విజయాన్ని అందించారు. తాండూరులోని సహారా క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో అండర్ 14 విభాగంలో పది మంది క్రీడాకారులు ఇండో- శ్రీలంకన్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన పోటీలలో వికారాబాద్ జిల్లా అండర్ 14 జట్టులో అంకుష్, దినేష్, మణికష్యప్ శెట్టి, వెంకట్ యాదవ్, ఐమాన్, కమలాకర్, దీపక్, ఆకాష్, శివ శంకర్, సూర్యలు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. అంకుష్ నాలుగు మ్యాచ్ లు ఆడి 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీశారు. అదేవిధంగా శివ శంకర్ 63 పరుగులు చేయగా.. ఆకాష్, ఐమాన్ లు చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇండో- శ్రీలంకన్ టోర్నమెంట్ లో సహారా క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సత్తా చాటడడంపై అకాడమి కోచ్ జగన్నాథ్ రెడ్డి అభినందించారు. మరోవైపు తాండూరు క్రీడా అభిమానులు క్రీడాకారులకు అభినందలు తెలిపారు.

