సుప్రీం కోర్టుకు చేరిన ఎమ్మెల్యే ఎర కేసు

క్రైం జాతీయం తాండూరు తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

సుప్రీం కోర్టుకు చేరిన ఎమ్మెల్యే ఎర కేసు
– హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్కారు నిర్ణయం
– పిటిషన్ వేసిన ప్రభుత్వ న్యాయవాది
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగించాలన్న తీర్పుపై స్టే విధించాలంటూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు 3 వారాల గడువు కోరింది. ఉదయం హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన సర్కారు సాయంత్రానికి సుప్రీంను ఆశ్రయించింది. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధించిన డివిజన్ బెంజ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే మాట్లాడుతూ ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ విషయంలో తమ అభ్యంతరాలను డివిజన్‌ బెంచ్‌ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళితే.. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా దెబ్బతింటుందని పేర్కొన్నారు. బుధవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరోసారి మెన్షన్‌ చేయాలని, విచారణ తేదీ ఇస్తామని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. ఒక వేళ మెన్షన్‌ చేయకపోయినా.. వచ్చే వారం కేసు విచారణకు వస్తుందన్నారు.