జై కేసీఆర్.. జై.. రోహిత్ అన్న..!
– బీఆర్ఎస్పై గిరిజన యువకుడి అభిమానం
– ఫిదా అయిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: జై.. కేసీఆర్.. జై.. రోహిత్ అన్న అంటూ ఓ గిరిజన యువకుడు బీఆర్ఎస్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో గిరిజన యువకుడి అభిమానానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫిదా అయ్యారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఓమ్లానాయక్ తాండాకు చెందిన సికిందరక్కు బీఆర్ఎస్ పార్టీ అన్నా, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అంటే చెప్పలేనంత అభిమానం. ఇటీవలే తన గుండెలపై తాండూరు అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బొమ్మను చాతిపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పెద్దేముల్ మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో సికిందర్ మరోసారి ఆకర్షణగా నిలిచాడు. చాతిపై ఎమ్మెల్యే . పైలెట్ రోహిత్ రెడ్డి పచ్చబొట్టుతో పాటు దేహంపై జై కేసీఆర్, జై రోహిత్ అన్న అంటూ పేరును రాసుకుని ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే. రోహిత్ రెడ్డి గిరిజన యువకుడి అభిమానానికి ఫిదా అయ్యారు. సికిందర్ ను దగ్గరికి పిలిపించుకుని శభాష్ అంటూ అభినందించారు.
ఇదికూడా చదవండి…

