విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపాలి
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. బుధవారం వార్డులోని ప్రాథమిక పాఠశాలలో శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సహాకారం అనే పోస్టర్ను కౌన్సిలర్ సంగీత ఠాకూర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యా నైపుణ్యాలు పెంచే విధంగా శిక్షణ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. కార్పేరేట్ కు ధీటుగా మెరుగైన విద్యను అందించేలా ఫౌండేషన్ కార్యాచరణ పుస్తకాలను అందించడం సంతోషకరమన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను బాగా చదివే విద్యార్థులతో జత చేసి విద్యా సామర్థ్యాలను పెంచే విధంగా దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు మాధవి, రాణి, శిక్షణ ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాములు, విద్యార్థులు పాల్గొన్నారు.

