మానవత్వంలోనూ దైవత్వం..!
– అందరి పట్ల సేవా గుణాన్ని కలిగి ఉండాలి
– అల్పహారం పంపిణీ చేసిన అయ్యప్ప దీక్ష ప్రచార సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మానవత్వంలోనూ దైవత్వం ఉంటుందని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు బాకారం జైపాల్ రెడ్డి, సభ్యులు అన్నారు. గురువారం అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అల్ఫహారం పంపిణీ చేశారు. సమితి జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి సభ్యులతో కలిసి తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు, అనాథ, అభ్యాగులకు వద్దకు వెళ్లి అల్పహారం వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డితో పాటు పలువురు సభ్యులు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని అల్ఫహారం పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. సమాజంలో జీవించే మనుషులు, ప్రాణుల పట్ల మానవతం చూపించడంలో దైవత్వం దాగి ఉంటుందన్నారు. అందరికి తోచిన సాయం.. సేవ అందించే గుణాన్ని కలిగి ఉండాలన్నారు. దైవ సేవతో పాటు సమాజ సేవకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు కొంపల్లి రమేష్, బసిరెడ్డి, నరేందర్ రెడ్డి, ఉదయ్ చారి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

