హైందవ చరిత్రలో గోవును విశిష్ఠ స్థానం
– మతం కోణంలో చూడరాదు
– గోవులో అనేక ఔషధ గుణాలు
– కవి, రచయిన డాక్టర్ భాస్కర యోగి
– రాజకీయాలతోనే విచ్ఛిన్నం అవుతున్నాం
– ఆర్ బిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
– గోశాలలో హైందవ శంఖారావం విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హైందవ మతంలో గోవుకు విశిష్ఠ స్థానం ఉందని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ భాస్కర యోగి అన్నారు.

దేశంలోని అన్ని పరవిత్ర స్థానాలు, దేవాలు గో అనే అక్షరంతో ప్రారంభం అవుతాయని గుర్తుచేశారు. గంగానది..గోవిందుడు..గోవు అన్ని కూడా గ అక్షరంతో ప్రారంభం అవుతాయని ఉదహరించారు. గోవును మతం కోణంలో కాకుండా గోవులోని ఔషధ గుణాల గొప్పతనంను చూడాలని భాస్కర యోగి పిలుపునిచ్చారు. తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హైజరైన ఆర్ బిఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి పాల్గొనగా ముఖ్యవక్తగా డాక్టర్ భాస్కర యోగి పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో హైందవ బంధువులు, గోభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యఅతిథి బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల కారణంగా హైందవులలో ఐక్యత తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని..ఆతరువాత హైందవులు ఐక్యంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాలలో గోశాలల ఏర్పాటుకు తన సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

తాండూరులో గోశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సమాజంను హైందవులలో పరివర్తన తీసుకవచ్చేందుకు గోశాల సభ్యులు మరింత చురుగ్గా కార్యక్రమాలను నిర్వహించాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. వచ్చే గణేష్ ఉత్సవాలలో ప్రతి వాడలో.. ప్రతి ఇంటిలో మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షులు వినోద్ జైన్, ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సారడా, కోశాధికారి పటేల్ విజయ్ కుమార్, గోశాల గౌరవ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ లు కొట్రికె విజయలక్ష్మీ, స్వప్నా పరిమళ్, హిందూ ఉత్సవ కేంద్ర సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, గోభక్తులు శంకర్ యాదవ్, డాక్టర్ సంపత్ కుమార్, బంటు మల్లప్ప పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తాండూరులోని వివిధ బస్తీలలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమాలను విజయవంతం చేసిన నిర్వహణ కమిటిలను సన్మానించారు. తాండూరు నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర చేసిన హైందవ బంధువులను సన్మానించారు.

