పేదింటి పెళ్లికి సాయం
– ఆడబిడ్డకు బీవీజీ ఫౌండేషన్ కానుక
– పుస్తె, మెట్టెలు అందించిన నాయకులు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి తాండూరు బీవీజీ ఫౌండేషన్ చేయూత అందించింది. ఫౌండేషన్ తరుపున పెండ్లి కూతురుకు పుస్త మెట్టెలు కానుకగా అందజేశారు. వివరాల్లోకి వెళితే… తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కల్లూరు అంజి తన కూతురు రేణుక పెండ్లి ఇటీవలే నిశ్చయించారు. పేద కుటుంబం కావడంతో అయితే పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తాండూరు బాలాజీ నర్సింగ్ హోమ్ అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ పెండ్లికి సాయం అందించేందుకు ముందుకొచ్చారు. ఫౌండేషన్ తరుపున పెండ్లి కూతురుకు కానుకగా పుస్తె, మెట్టెలను అందించారు. శుక్రవారం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మల్కాపూర్ ఎంపీటీసీ రవిశిండే, గని కార్మిక సంఘం మాజీ వైస్ చైర్మన్ ఎస్.పండరి, బీఆర్ఎస్ నాయకులు వి.మల్లేశం, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, జె.కిష్టప్ప, ఎం. వెంకటి, చందు తదితరులు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పెండ్లి కూతురు తండ్రి ఆంజి బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

