ఇండ్ల స్థలాలు కేటాయించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇండ్ల స్థలాలు కేటాయించండి
– తాండూరు ఎమ్మెల్యేతో హమాలి కార్మికుల వినతి
– సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన కార్మికులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మార్కెట్ కమిటిలో పనిచేస్తున్న హమాలి కార్మికులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కార్మికులు కోరారు. సోమవారం హైదరాబాద్ లో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్, హమాలి సంఘం ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మార్కెట్ కమిటిలో పనిచేస్తున్న కార్మికులకు ఇండ్ల స్థలాలు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. కావున వారికి ఇండ్ల స్థలాలు కేటాయించి, ఇండ్లు నిర్మించి ఇచ్చేలా చూడాలని కోరారు. అదేవిధంగా మార్కెట్లో కార్మికులకు రూ. 10 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, యజమానుల ఇండ్లలో పనిచేస్తున్న మహిళలకు రూ. 5 వేలు ఇవ్వాలని, వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించేలా కార్మిక చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు అందించేలా కృషి చేయాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు నేతలు, కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి కార్మిక సంఘం అధ్యక్షులు భీమప్ప, కార్యదర్శి బాలప్ప, కోశాధికారి రాజేష్, ఉపాధ్యక్షులు భద్రయ్య, శ్రీనివాస్, సహా కార్యదర్శి వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.