గౌడ సంఘం భూమిలో అక్రమార్కుల పాగ
– చర్యలు తీసుకుని కబ్జా భూమిని కాపాడండి
– తాండూరు డిఎస్పీ, పోలీసులకు గౌడ సంఘం సభ్యులు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి: గౌడ సంఘంకు చెందిన భూమిని కొందరు అక్రమార్కులు కబ్జాచేసేందుకు పాగా వేస్తున్నారని, వెంటనే మా భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని తాండూరు డీఎస్సీ, పట్టణ పోలీసులకు గౌడ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదివారం తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డిలను కలిసి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు గౌడ సభ్యులు ఫిర్యాదు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో తాండూరు రెవెన్యూ పరిధి మల్ రెడ్డిపల్లి శివారులోని సర్వేనెంబర్ 37/1లో 2 ఎకరాల 16 గుంటల భూమిని గౌడ సంక్షేమ సంఘం తరుపున కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. సోసైటీ నుంచి 16 మంది సభ్యులు కలిసి భూమి కొనుగోలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. తాజాగా కొందరు అక్రమార్కులు అన్యాయంగా మా భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కావున కబ్జాకు గురవుతున్న భూమిని చెర విడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు ప్రసాద్ గౌడ్, మధుసూదన్ గౌడ్, బాల శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

