వరధనీటికి ధారి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వరధనీటికి ధారి..!
– అధికార యంత్రాంగం తాత్కాళిక చర్యలు
– పరిశీలించిన చైర్ పర్సన్, కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వరధనీటి కష్టాలకు అధికారులు తాత్కాళిక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గం, గ్రీన్ సిటీ, మార్కండేయ కాలనీలకు వరధనీటి కష్టాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ రోడ్డు మార్గంలో వరధనీరు నిండుకోవడంలో రాకపోకలు స్థంభించాయి. రోడ్డు మద్యలోని డివైడర్ ఎత్తు వరకు నీళ్లు నిలిచాయి. ఈ మార్గంలో రాకపోకలు, ట్రాఫిక్ జామ్ పై అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి రోడ్డు మార్గాన్ని సందర్శించారు.

ఈ మార్గంలో రోడ్డుపై నీరు నిలవకుండా డివైడర్ మద్యలో గండి కొట్టారు. వరధ నీరు మొత్తం ప్రవహించే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మార్కండేయ కాలనీని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సందర్శించారు. చిలుకవాగు వరధ నీరు కాలనీలో చేరడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్నా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పరిశీలించారు. ప్రత్యేక జేసీబీ యంత్రంతో కాలనీలో వరధనీరు నిలవకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలో నాలాలు, కాలువలు కబ్జాలు కావడంతో వరధనీరు ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రస్తుతానికి తాత్కాళిక చర్యలు తీసుకుంటామని… త్వరలోనే శాశ్విత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఖాజా హుస్సేన్, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఏమాత్రం ఏమరుపాటు వద్దు..!