గిరిజనుల గొప్ప దైవం సేవాలాల్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

గిరిజనుల గొప్ప దైవం సేవాలాల్‌
– ఆయన జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి
– మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్
– కందనెల్లిలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : గిరిజనుల గొప్ప ఆరాధ్య దైవం సేవలాల్ మారాజ్ అని, ఆయన జయంతిని సెలవుదినంగా ప్రకటించాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్‌ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. శ్రీ సేవాలాల్ 313 అవతార మహోత్సవం ఆధ్యాత్మిక వేడుకల సందర్భంగా జాగో బంజారా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు అధ్యక్షులు రాథోడ్ రమావత్ సురేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దేముల్ మండలం కందనెల్లి తండాలో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ పెద్దముల్ వైస్ ఎంపీపీ మదులత శ్రీనివాస్ చారి, గౌరవ అతిథులు శ్రీ బాబాన్ సింగ్ మహారాజ్‌లతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ విట్టల్ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గిరిజనులు సేవాలాల్ మహారాజ్ చూపిన సన్మార్గంలో నడవాలని అన్నారు. గౌరవ అతిథి శ్రీ బాబాన్ సింగ్ మహారాజ్ మాట్లాడుతూ గిరిజనుల ఆరోగ్య దైవం అయినటువంటి శ్రీ సేవాలాల్ మహారాజ్ ను ప్రతి ఇంటిలో పూజించాలని సూచించారు. గిరిజనులు చెడు అలవాట్లను దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని సూచించారు. గిరిజనులు ఐక్యమత్యంగా ఉండి సమాజంలో అభివృద్ధి చెందాలని అన్నారు. అదేవిధంగా రాజకీయంగా కూడా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బంజారాల నాయకులు గిరిజన సోదరులు తదితరులు పాల్గొన్నారు.