తాండూరు యువతకు రినీష్ రెడ్డి తోడ్పాటు
– ప్రైవేటు సంస్థలో ఉద్యోగ అవకాశాలు
– నియామకపత్రాల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డిల తనయుడు పట్నం రినీష్ రెడ్డి తాండూరు యువతకు తోడ్పాటు అందించారు. హైదరాబాద్ లోని ప్రైవేటు సంస్థ రైన్ అకాడమిలో నియోజకవర్గానికి చెందిన యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఉద్యోగాలకు ఎంపికైన తాండూరు నియోజకవర్గంకు చెందిన ఎ. అరవింద్ (నెల వేతనం రూ.27 వేలు), పి. సాయికుమార్ (నెల వేతనం రూ.22 వేలు)లతో పాటు మరో నలుగురు వివేక్ వర్ధన్, హరీష్ గౌడ్, రాకేష్ కుమార్, ఎం.అశిష్ కుమార్ కు ఉద్యోగ శిక్షణకు చేయూతనందించారు.
బుధవారం రినీష్ రెడ్డి జన్మది సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు యువత అభ్యున్నతికి తన వంతు తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. మరోవైపు నియామక పత్రాలు, శిక్షణకు ఎంపికైన యువత రినీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

