దోస్త్..మేరా దోస్త్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

దోస్త్..మేరా దోస్త్..!
– మనోజ్.. మౌనికలను ఏకం చేసిన ఎమ్మెల్యే
– పెళ్లి పెద్దగా మారిన పైలెట్ రోహిత్ రెడ్డి
– పైలెట్‌ చొరవపై వెల్లువెత్తున్న ప్రశంసలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రాష్ట్ర, దేశ రాజకీయాలలో సంచలనం రేపిన పేరు అది. గతకొన్ని నెలలుగా ఎక్కడ చూసినా పైలెట్ రోహిత్ రెడ్డి మారుమోగి పోతున్న విషయం తెలిసిందే. తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డి తన స్నేహితుల కోసం చేసిన చొరవతో రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాల్లో పేరు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సీని నటుడు మంచు మనోజ్‌ కుమార్, భూమా మౌనిక రెడ్డిలు ఇటీవల పెళ్లిబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే వారిద్దరిని ఏకం చేయడంలో పైలెట్ రోహిత్‌ రెడ్డి పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. మనోజ్‌, మౌనిక రెడ్డిల పెళ్లి.. తరువాత జరుగుతున్న కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముందుంటున్నారు. దీంతో అందరు రోహిత్ రెడ్డి ప్రమేయంపై చర్చించుకోవడంతో అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంచు మనోజ్‌, మౌనికా రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు గతంలో కలిసి చదువుకున్నారని తెలిసింది. ఈ ముగ్గురు మంచి స్నేహితులని కూడ తెలిసింది. మంచు మనోజ్ తన భార్యతో విడిపోవడం, ఇటు మౌనిక రెడ్డి భర్తతో విడాకులు తీసుకోవడం జరిగిన తరువాత వారిద్దరిని పైలెట్ రోహిత్ రెడ్డి ఒక్కటి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వారిద్దరి పెళ్లి గురించి పైలెట్ రోహిత్ రెడ్డి ఇరుకుటుంబాలతో చర్చించారని, ఆయన చొరవతోనే మంచు..భూమా కుటుంబాలు ఒక్కటయ్యాయని అనుకుంటున్నారు. అందకనే రోహిత్ రెడ్డి మనోజ్, మౌనిక రెడ్డిల కార్యక్రమాల్లో ప్రధానంగా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. స్నేహితుడి కోసం పైలెట్ రోహిత్ రెడ్డి ఇదంతా చేశారని, స్నేహం కోసం రోహిత్ రెడ్డి చేసిన చొరవపై తెలంగాణ..రాయలసీమలో ప్రశంసలు వెలువెత్తుతున్నాయి.