పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భ‌రోసా

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భ‌రోసా
– ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ ప‌థ‌కం పేద‌ల ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పిస్తుంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టణంలో మ‌ల్‌రెడ్డిప‌ల్లికి చెందిన చంద్రమ్మకు మంజూరైన‌ రూ. 70 వేల సీఎంఆర్ఏఫ్ చెక్కును అంద‌జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నదన్నారు. ఎటువంటి కష్టమొచ్చినా ఆత్మీయ భరోసా ఇస్తుంద‌న్నారు.
ఆపత్కాలంలో ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాల బారిన పడుతున్న పేదలకు కార్పొరేట్‌ వైద్యంతో స్వస్థత పొందేందుకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం ఎంతో తోడ్పాటును అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు, నాయ‌కులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, రాజుగౌడ్, శ్రీ‌నివాస్ చారి త‌దిత‌రులు ఉన్నారు.