మార్చి 16 నుంచి వర్షాలు..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

మార్చి 16 నుంచి వర్షాలు..!
– వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక
– కాణరమేంటో క్లారిటీ ఇచ్చిన అధికారులు
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. గత కొన్ని రోజుల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎండ వేడి తీవ్రత తగ్గి, చల్లని గాలులు వీస్తున్నాయి. గత కొన్ని రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల స్థాయిలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎండ వేడిమికి తాళలేక ప్రజలు ఇల్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో బానుడి భగభగల నుంచి ఉపశమనం లభించనున్నట్లు వాతావారణ విభాగం అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఏర్పడినట్లు తాజాగా వాతావరణ వాతావరణ శాఖ తెల్పింది. ఈ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న కొన్ని రోజుల పాటు పలు చోట్ల చిరుజల్లులు కురిసే అవకావం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 16వ తేదీ అనంతరం పలు జిల్లాల్లో చిరు జల్లులు కురవనున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి, ఉదయం సమయాల్లో వర్షం కురిసే అకాశం ఉందని అంటున్నారు. ఆకాల వర్షాలతో పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.