బీజేపీ సాత్ హై.. డర్ నేకా నహి..!
– మురళీకృష్ణ గౌడ్‌కు అమిత్ షా భరోసా
– అమిత్ షాను కలిసిన మురళీకృష్ణ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీ ఆప్‌కా సాత్ హై.. డర్ నేకా నహీ.. మురళీకృష్ణ గౌడ్‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్క మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్‌కు భరోసా అందించారు. శనివారం తెలంగాణ పర్యటనలో భాగంగా సీఐఎస్ ఎఫ్ రైసింగ్ డే పరేడ్ లో అమిత్ షా పాల్గొన్నారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యులు కె. లక్ష్మణ్, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీనియర్ నేతలు డీకే అరుణ, నల్లు ఇంద్రా సేనా రెడ్డి, పొంగులేని సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, విజయశాంతి, వివేక్, వెంకట స్వామి, గరికపాటి మోహన్ రావు, రఘునందన్ రావు తదితరులతో కలిసి స్వాగత కార్యక్రమంలో మురళీకృష్ణ గౌడ్ కూడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మురళీకృష్ణ గౌడ్ పై శివస్వాముల ఘటన, కుటుంబంపై దాడి విషయాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న అమిత్ షా మురళీకృష్ణ గౌడ్ తో మాట్లాడుతూ మురళీకృష్ణాజీ డర్ నేకా నహీ.. బీజేపీ ఆఫ్ కా సాత్ హై అంటూ అభయం ఇచ్చారు. ఏ విషయంలో అయినా నేతల అండదండలు ఉంటాయని భరోసా అందించారు. ఈ సందర్భంగా మురళీ కృష్ణ గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు భయపడేది లేదని, తాండూరు నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు.

