వసతి గృహానికి నేతల క్యూ..!

ఆరోగ్యం క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వసతి గృహానికి నేతల క్యూ..!
– విద్యార్థిని అస్వస్థతపై అధికారుల పరిశీలన
– హాస్టల్ వద్ద పోలీసుల బందోబస్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని సాయిపూర్లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉదయం విద్యార్థినిలు అస్వస్థతకు గురికాగా సాయంత్రానికి ఈ సంఖ్య పెరిగింది. దీంతో రెవెన్యూ, పోలీసులు, విద్యాశాఖ, వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యాయి. సంఘటనకు కారణమైన హాస్టల్లో పోలీసు సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. సాయంత్రం వేళ వైద్య సిబ్బంది విద్యార్థినిలకు వైద్య సేవలు అందించారు. మరో నలుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురికాగ వైద్య సిబ్బంది ముగ్గురికి హాస్టల్లోనే ఉంచి వైద్య సేవలు అందించారు. ఓ విద్యార్థినిని తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. హస్టల్ వద్ద అంబులెన్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. సాయంత్రం కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, నాయకులతో కలిసి హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల అస్వస్థత, ఆరోగ్యం గురించి ఆరా తీశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని సూచించారు. అంతకుముందు కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డి కూడా హాస్టల్‌ను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థిని తన కారులో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలులు హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.

సందర్శించిన బీజేపీ నేతలు
విద్యార్థినిలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న బీజేపీ దిశ జిల్లా కమిటీ సభ్యురాలు అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు హస్టల్ వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. కొద్ది సేపటి తరువాత మహిళ నాయకులు అంతారం లలిత, సాహు శ్రీలత తదితరులు లోపలికి వెళ్లారు. ఆక్కడ ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కౌన్సిలర్ సాహు శ్రీలత ఆమెను చేతులు మోసుకుని బయటకు తీసుకవచ్చారు. అనంతరం విద్యార్థినిని కారులో మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ తదితరులు పరామర్శించారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు బీఆర్ఎస్ నేతలు
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మహిళ కన్వినర్ శకుంతల, బీఆర్ఎస్వీ నాయకులు సందీప్ రెడ్డి తదితరులు హాస్టల్ను సందర్శించారు. వి ద్యార్థినిలు అస్వస్థతకు గురికావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

చట్టంతో మానవ హక్కుల సంరక్షణ