మహిళలు స్పూర్తిగా నిలవాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని రంగాలలో మహిళలు స్పూర్తిగా నిలవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న సరిమళ్ అన్నారు. తాండూరు వాసవీ మహిళా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా దినోత్సవంలో భాగంగా వాసవీ సంఘం మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళ దినోత్సవాన్ని సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. విద్యా, వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, వైద్యం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు కీలకంగా నిలుస్తున్నారని అన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ మహిళలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళ సంఘం సభ్యులు చైర్ పర్సన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కల్వ సుజాత, వాసవీ మహిళ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

