ఎంఐఎం కౌన్సిల‌ర్‌ను స‌స్పెండ్ చేయాలి

తాండూరు

ఎంఐఎం కౌన్సిల‌ర్‌ను స‌స్పెండ్ చేయాలి
– ఇంచార్జ్ క‌మీష‌న‌ర్‌కు ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్ల విన‌తి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ ఎంఐఎం కౌన్సిల‌ర్‌ను స‌స్పెండ్ చేయాలిని ప్ర‌తిప‌క్ష కౌన్సిల‌ర్లు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు తాండూరు ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్‌కు సీఐపీ ఫ్లోర్ లీడ‌ర్ ఆసిఫ్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడ‌ర్ వ‌రాల శ్రీ‌నివాస్ రెడ్డి, టీజేఎస్ ఫ్లోర్ లీడ‌ర్ సోమ‌శేఖ‌ర్, కాంగ్రెస్ కౌన్సిల‌ర్ ప్ర‌భాక‌ర్ గౌడ్‌లు విన‌తిప‌త్రం అంద‌జేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ శ‌నివారం మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన అత్య‌వ‌స‌ర స‌మావేశంలో సీపీఐ ఫ్లోర్ లీడ‌ర్ ఆసిఫ్‌పై ఎంఐఎం ఫ్లోర్ లీడ‌ర్ సాజిద్ అలీ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ దాడి చేసేందుకు య‌త్నించార‌ని ఆరోపించారు. చైర్ ప‌ర్స‌న్, వైస్ చైర్ ప‌ర్స‌న్, కౌన్సిల‌ర్ల స‌మక్షంలో దౌర్జ‌న్యానికి య‌త్నించిన ఎంఐఎం ఫ్లోర్ లీడ‌ర్ సాజిద్ అలీపై చ‌ర్య‌లు తీసుకుని స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్, సీడీఎంఏకు ఫిర్యాదు చేస్తామ‌ని తెలిపారు. మ‌రోవైపు మున్సిప‌ల్ జ‌రుగుతున్న అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగా దాడి చేసే ప్ర‌య‌త్నం చేశార‌ని విమ‌ర్శించారు.