తాండూరు మైనార్టీలకు శుభవార్త

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు మైనార్టీలకు శుభవార్త
– 21న మైనార్టీ కార్పోరేషన్ జేఐసీ క్యాంపు
– వ్యక్తిగత రుణ లబ్దిదారుల ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రాంతానికి చెందిన మైనార్టీ యువత, ప్రజలకు మున్సిపల్ అధికారులు శుభవార్త చెప్పారు. మున్సిపల్ కార్యాలయంలో ‘రేపు మంగళవారం మైనార్టీ కార్పోరేషన్ కింద వ్యక్తిగత రుణ లబ్దిదారుల జేఐసీ(జాయింట్ ఐటెండిఫీకేషన్ క్యాంపు) క్యాంపు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీ కార్పోరేషన్ కింద వ్యక్తిగత రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఆన్లైన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు ఈనెల 21న మంగళవారం ఉదయం 11 గంటలకు జరిగే జాయింట్ ఐడెంటిఫికేషన్ క్యాంపకు హాజరు కావాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు వారి దరఖాస్తు ఫారంతో ఆధార్ కార్డు, కుల, ఆధాయ ధృవీకరణ పత్రాలు తీసుకరావాలని సూచించారు.