రంజాన్‌కు సౌకర్యాలు కృలించండి
– నేతలు, అధికారులకు ఎంఐఎం నాయకుల వినతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రంజాన్ మాసంను పురస్కరించుకుని మసీదులు, ఈద్గాలు, స్మశాన వాటికల వద్ద సౌకర్యాలు కల్పించాలని తాండూరు ఎంఐఎం మైనార్టీ నాయకులు కోరారు. మంగళవారం ఎంఐఎం పట్టణ అధ్యక్షులు హాది షహేరి ఆధ్వర్యంలో కౌన్సిలర్ బొంబీనా, నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు డీఎస్సీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, విద్యుత్ అధికారి భాను ప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ నెల నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం ద్వారా కోరారు. ప్రతిరోజూ నీటి వసతి, పారిశుధ్య పనులు, విద్యుత్ సదుపాయం కల్పించాలని అన్నారు. స్మశాన వాటికలో విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటు పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు యూనుస్, నభి సాటేర్, అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

