ఆటోలో నుంచి డబ్బులు చోరీ

క్రైం తాండూరు వికారాబాద్

ఆటోలో నుంచి డబ్బులు చోరీ
– పోలీసులను ఆశ్రయించిన బాధిత డ్రైవర్
– తాండూరు పట్టణంలో సంఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆసుపత్రి వద్ద పార్కింగ్ చేసిన ఆటోలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు చోరీ చేశారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బంగరి నర్సప్ప అనే వ్యక్తిని కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స కోసం తాండూరు పట్టణంలోని జేబీ ఆసుపత్రికి ఆటోలో తీసుకవచ్చాడు. అయితే అప్పటికి తన వద్ద ఉన్న రూ.9500ల నగదును ఆటోలో ముందుభాగంలో ఉన్న డబ్బా లాకర్ లోనే ఉంచాడు. రాత్రి ఆకలి వేయడంతో ఆటోను ఆసుపత్రి వద్దే ఉంచి సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్దకు వెళ్లాడు. భోజనం చేసి తిరిగి ఆసుపత్రికి వచ్చి చూసే సరికి ఆటోలోని డబ్బాల లాకర్ లు తెరిచి ఉండడంతో డబ్బుల కోసం చూడగా కనిపించలేదు. దీంతో డబ్బులు చోరీ అయినట్లు గుర్తించాడు. అటు ఇటు వెతికినా ఫలితం లేకుండా పోయింది. తాండూరు పట్టణ పోలీసులను ఆశ్రయించి డబ్బులు పోయాయని ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడ సీసీ పుటేజీలను పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు. చోరీ అయిన డబ్బులు రికవరీ అయ్యేలా చేసి తనకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్ కోరుతున్నాడు.