వృత్తి నైపుణ్యంతో మహిళల అభ్యున్నతి
– శిక్షణ శిబిరాలను అందరు సద్వినియోగం చేసుకోవాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వృత్తి నైపుణ్యంతో మహిళలు ఆర్థికాభివృద్ధి చెందాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం తాండూరు పట్టణం విలియంమూన్ స్కూల్లో జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు(నాబార్డు) సహాకారంతో మహిళలకు ఉచిత ఎంబ్రాయిడరీ వర్క్స్ పై ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మహిళలు వృత్తి నైపుణ్యంలో రాణించి ఆర్థికంగా అభ్యున్నతి చెందాలని అన్నారు. శిక్షణ తరువాత మహిళలు కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని మరో పది మందికి శిక్షణ ఇచ్చి తోడ్చాడాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలు అందించే రుణసదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాహు శ్రీలత, నాయకులు సలీం, ఇంతియాజ్, డీఎల్ఎం ప్రవీణ్ కుమా, ఎల్డీఎం రాంబాబు, ఆర్గనైజర్ సునీత, మెప్మా టీఎంసీ సరిత, సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

