ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో వినాయ‌క చ‌వితి శోభ‌

తెలంగాణ మహబూబ్ నగర్ రాజకీయం హైదరాబాద్

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో వినాయ‌క చ‌వితి శోభ‌
– గ‌ణ‌నాథునికి పూజ‌లు చేసిన సీఎం కేసీఆర్
– పూజ‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్
తెలంగాణ, ద‌ర్శిని ప్ర‌తినిధి: హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో వినాయ‌క చ‌వితి శోభ సంత‌రించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు సైతం వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రగతిభవన్‌లో వినాయక చవితి వేడుకలను కేసీఆర్ కుటుంబం ఘనంగా నిర్వహించారు. ప్రగతి భవన్ ప్రాంగణంలో భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగించి, తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజించారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా చూడాలని పార్వతీ తనయుడు గణనాథున్ని సీఎం కేసీఆర్‌ వేడుకున్నారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన గణేషుడి ప్రత్యేక పూజలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దంపతులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అదేవిధంగా పార్లమెంటు సభ్యులు సంతోష్ కుమార్ కూడ పూజ‌లో పాల్గొన్నారు.