రంజాన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

తాండూరు రాజకీయం వికారాబాద్

రంజాన్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్
– ఈద్గాను సందర్శించి పరిశించిన ఎమ్మెల్సీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల రంజాన్ పండగకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణ శివారులోని ఈద్గా మైదానాన్ని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కమీషనర్ శంకర్ సింగ్ లతో కలిసి సందర్శించారు. రంజాన్ సందర్భంగా ప్రార్థన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండగ సందర్భంగా ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులకు సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు.

అనంతరం ముస్లిం సోదరులతో కలిసి కమీషనర్ శంకర్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ ఖాజా, ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల నాయకులు బిర్కడ్ రఘు, మసూద్, కార్యకర్తలు, మస్లిం సోదరులు ఉన్నారు.