యేసు మార్గం అనుసరణీయం
– క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో అందరి క్షేమాన్ని ఆశించే యేసు మార్గం అందరికి అనుసరణీమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రో హిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, తాండూరు మండలాలతో పాటు తాండూరు పట్టణంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
పట్టణంలోని ఆయా ప్రాంతాల్లోని చెర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతికి రూపం, దయగల హృదయుడు, లోక రక్షకుడైన యేసు మార్గం అందరికి అనుసరణీమని అన్నారు. తాండూరులో చేర్చిల అభివృద్ధి, క్రైస్తవుల సంక్షేమానికి తోడ్పాటునందిస్తానని పేర్కొన్నారు. మరోవైపు ఆయా చెర్చిలలో పాస్టర్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, విజయ్ కుమార్, పాసర్లు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.
