పాపం.. పాము..!
– కొనఊపిరితో కొట్టుమిట్టు
– ఆపరేషన్ చేసి కాపాడిన వైద్యులు
దర్శిని డెస్క్: ప్రాణాలు తీసే పాములపై కరణ చూపిన సంఘటన ఇది. కొన ఊపిరితో కొట్టు మిట్టుఆడుతున్న పాముకు వైద్యుల సమక్షంలో ఆపరేషన్ చేసి దాని ప్రాణాలను కాపాడారు. తెలుగు రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కొనసీమ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం సింగరాయపాలెం గ్రామంలో గత కొన్ని రోజుల నుంచి వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 5 రోజుల క్రితం ఓ మాగాణిలో ఉన్న ఓ భారి తాచుపాము వరి కోత మిషన్‌లో పడి తీవ్రంగా గాయపడింది. అది అక్కడ్నుంచి కదల్లోక బాధతో విలవిల్లాడుతుంది.
అది అప్పటి నుంచి ప్రాణాల కోసం పోరాడుతుంది. గాయంతో విలవిల్లాడుతున్న పామును చూసిన స్థానికులు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ, వైద్యుడు రమేష్‌కు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దానికి ఆపరేషన్ చేశారు. అది కాస్త కోలుకున్న అనంతరం.. సురక్షత ప్రాంతంలో విడిచిపెట్టారు. తాచుపామును చూసి పారిపోయే వాళ్లను చూసి ఉంటారు. ధైర్యంతో దాన్ని చంపేసేవాళ్లను చూసి ఉంటారు. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్. గాయపడ్డ పామును బతికించేందుకు గ్రామస్థులు అంతా ఒక్కటయ్యారు. పాపం పాము అంటూ కరుణ చూపిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణులపై మనషుల మానవత్వానికి సలాం చేస్తున్నారు. ఈ కింద వీడియో ఉంది చూడండి
..

