సులువుగా బరువు తగ్గాలంటే..
– ప్రతిరోజూ ఇవి తాగండి
– నిమ్మ, బెల్లంతో ఆరోగ్య ప్రయోజనాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఒకే రోజు.. లేదా రెండు రోజుల్లో బరువు తగ్గాలంటే సాధ్యం కానిపని. బరువు తగ్గేందుకు కొంత మంది డైట్, వర్కవుట్ చేస్తారు. చాలా మంది ఇవి పాటించేందుకు ఆసక్తి చూపించరు. ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది నానా తంటాలు పడుతున్నారు. తగ్గి తీరాలనుకునేవారు ఈ మాత్రం కష్టపడాలి తప్పదు మరి. కాని కొన్ని ఆహార, పానీయాల వల్ల బరువు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయ, బెల్లం కలిపిన పానీయం సులువుగా బరువు తగ్గిస్తుందని తేలింది.
బెల్లంతో ఉపయోగం
బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, ఖనిజాలు, సెలీనియం, మాంగనీస్, కాపర్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ సమస్యను నయం చేయడంలో కూడా తోడ్పడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
నిమ్మతో ఆరోగ్య ప్రయోజనం
ఇక నిమ్మకాయను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇందులో ఫోలేట్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ప్రొటీన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. అజీర్ణం, మొటిమలు, రాళ్లు, ఊబకాయం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యం నిమ్మకాయకు ఉంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.