సామాన్యులకు షాక్…!
– భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు
– ధరలు పెరగడానికి కారణాలు ఏమంటే..?
దర్శిని డెస్క్ : దేశంలోని సామాన్యులకు భారీ షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చి భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై విశ్లేషకులు వేసిన అంచనా ఇది. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల పరిణామాలు చమురు సరఫరాలపై ప్రభావం పడింది. దీంతో ఈ వారం చమురు ధరలు బ్యారెల్‌కు 6 డాలర్ల వరకు పెరిగాయి. చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.గత రెండేళ్లుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించలేదు. రూ. 2 నుంచి 3 మధ్యలో పెంచుతూ, తగ్గిస్తూ వస్తుంది కానీ, ఒకేసారి పెద్ద మొత్తంలో తగ్గించలేదు.
ఒక్కసారిగా భారీగా పెట్రోల్ రేట్లు తగ్గిస్తే కేంద్రంపై భారం పడే అవకాశం ఉందని, దానికితోడు వాహనదారులు కూడా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పెంచేస్తారని అభిప్రాయపడుతోంది. ఇదే ప్రభావం గ్యాస్ ధరలపై కూడా పడే అవకాశం ఉంది. యూఎస్ ముడి చమురు ధర 74.38 డాలర్ల వద్ద ఉండగా, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 78.05 డాలర్ల వద్ద ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగితే చమురు ధరలు 80 డాలర్లకు లేదా అంతకంటే ఎక్కువకు చేరవచ్చని ఎనర్జీ అనాలసిస్ గ్లోబల్ హెడ్ టామ్ క్లోజా పేర్కొన్నారు. ప్రస్తుతం గ్యాస్ ధరలు అంతగా పెరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం గ్యాలన్ గ్యాస్ సరాసరి ధర 5 సెంట్లు పెరిగింది.
మరోవైపు శనివారంతో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిశాయి. ఎన్నికలకు ముందు ఆయిల్ రేట్లు పెంచితే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాటిని ఇన్ని రోజులు స్థిరంగా ఉంచింది. తాజాగా అన్ని రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అవ్వండంతో పెట్రోల్, డీజిల్‌తో పాటుగా వంటగ్యాస్ ధరలను కూడా కేంద్రం సవరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదికూడా చదవండి…

