రంజాన్ ప్రార్థనలకు పకడ్బందీ ఏర్పాట్లు

తాండూరు రాజకీయం వికారాబాద్

రంజాన్ ప్రార్థనలకు పకడ్బందీ ఏర్పాట్లు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఈద్గాను సందర్శించి పరిశించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనలకు, పండగకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణ శివారులోని ఈద్గా మైదానాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలులతో కలిసి సందర్శించారు. రంజాన్ సందర్భంగా మైదానంలో ముస్లిం సోదరుల ప్రార్థన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ పండగను పురస్కరించుకుని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులకు సౌకర్యాలు, వసతులు కల్పించాలని ఆదేశించారు.

రంజాన్ పండగ రోజు ప్రార్థనకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా, ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్, పలువురు ముస్లిం సోదరులు ఉన్నారు.