రైతుల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల అభివృద్ధికి సర్కారు ప్రాధాన్యం
– కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: రైతుల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ సర్కారు ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు మార్కెట్ కమిటి ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ, నాఫెడ్, సెర్ఫ్ సంస్థ సహాకారంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చైర్మన్, డైరెక్టర్లతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందిస్తూ ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

రైతుల సంక్షేమంతో పాటు అభ్యున్నతిని ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మార్కెట్ కమిటిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సిరెడ్డి, ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కిరణ్ కుమార్, మార్కెట్ కమిటి డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

2026 క్యాలెండర్‌ ఆవిష్కరణ