గోశాలలో కార్తీక దీపోత్సవం
– ఏర్పాట్లు చేసిన గోశాల సేవా సమితి
– విజయవంతం చేయాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని గోశాలలో ఎల్లుండి శనివారం కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు గోశాల సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహిస్తున్న దీపోత్సవాన్ని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. డిసెంబర్ 9వ తేది శనివారం సాయంత్రం 6 గంటల నుంచి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి అందరు ఆహ్వానితులే అని సూచించారు. దీపోత్సవం అనంతరం భక్తులకు గోప్రసాదం ఉంటుందన్నారు. కావున మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

