కంచెలేని ట్రాన్స్‌ ఫార్మర్‌తో మూగజీవి బలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కంచెలేని ట్రాన్స్‌ ఫార్మర్‌తో మూగజీవి బలి
– విద్యుత్ షాక్ తగిలి దూడ మృత్యువాత
– తాండూరులో ఆలస్యంగా వెలుగులోకి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కంచెలేని ఓ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వల్ల మూగ జీవి మృత్యువాత పడింది. తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మున్సిపల్ పరిధి 1వ వార్డు మల్ రెడ్డిపల్లిలోని భరత్ నగర్కు చెందిన దండు గోపాల్ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అదేవిధంగా గేదెలను, దూడలను కూడ పెంచుతున్నాడు. అతని వద్ద ఉన్న జెర్సీ జాతికి చెందిన దూడ శనివారం సాయంత్రం కాలనీ సమీపంలో ఉన్న పొలాల వైపు వెళ్లింది.

అక్కడే ఉన్న కంచెలేని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఉచ్చాడుతుండగా ప్రమాద వశాత్తు ట్రాన్స్ ఫార్మర్ కు చెందిన ఆర్డింగ్ వైరుతో విద్యుత్ షాక్ కు గురై అక్కడిక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన బాధిత యజమాని విషాదం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్ వల్ల మృతి చెందిన దూడతో రూ. 35 వేల వరకు, ఆస్తినష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద గతంలో ఇలాంటి సంఘటన రెండు, మూడు జరిగాయని, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపించాడు.