నృత్య రంగంలో దూసుకపోవాలి
– ఢీ-13 విన్నర్ కావ్యశ్రీని సన్మానించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈటీవీ ఢీ-13 విన్నర్ కావ్యశ్రీ నృత్య రంగంలో దూసుకపోవాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. తాండూరు పట్టణానికి చెందిన కావ్యశ్రీ ఈటీవీలో ప్రసారమైన ఢీ-13 కింగ్ వర్సెస్ క్వీన్ విభాగంలో ఫైనల్‌కు చేరి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కావ్యశ్రీ విజేతగా నిలిచింది. శనివారం కావ్యశ్రీ తన తల్లిదండ్రులతో కలిసి ఎమ్మెల్సీ నివాసంలో మహేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి విన్నర్ కావ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలోని పేద కుటుంబానికి చెందిన కావ్యశ్రీ ఢీ-13షోలో విజేతగా నిలవడం అభినందనీమన్నారు. కావ్యశ్రీ తన ప్రతిభతో నృత్య రంగంలో దూసుకపోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు మసూద్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
