అంబేద్కర్ జయంతిపై రాద్దాంతం తగదు
– ఉత్సవాలు పార్టీలకు సంబంధం లేదు
– దుష్ప్రచారాన్ని ఖండించిన జై భీమ్ ఉత్స కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతిపై రాద్దాంతం చేయడం మంచిపద్దతి కాదని తాండూరు జైభీమ్ ఉత్సవ కమిటి సభ్యులు అన్నారు. తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 132 జయంతి ఉత్సవాలపై రాజకీయ పార్టీల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని వారు. ఆదివారం వారు ఓ ప్రకటనలో ఖండించారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ తాండూరులో నిర్వహించిన 132వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు కొందరు పార్టీలకు సంబంధం ఉందని చేసిన వాఖ్యలను చేయడం సబబు కాదన్నారు.
కేవలం ర్యాలీని దృష్టిలో ఉంచుకుని పార్టీకి సంబంధం ఉందని ప్రచారం చేయడం తగదన్నారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా జైభీమ్ ఉత్సవ కమిటి, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. దీనిపై రాద్దాంతం చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటి సభ్యులు శివకుమార్, విష్ణు, శ్రీశైలం, చెన్నప్ప, అనిల్, వెంకటేష్, సాయి, బాలు, తమ్మప్ప, శ్రీనివాస్, గోవింద్, ఎల్లప్ప, రాజు తదితరులు పాల్గొన్నారు.

