నకిలీపై ముమ్మర తనిఖీలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నకిలీపై ముమ్మర తనిఖీలు..!
– ఫర్టిలైజర్‌ షాపుల్లో రికార్డుల పరిశీలన
– ఫేక్, లూజ్ విత్తనాల విక్రయాలపై ఆరా
– తనిఖీలో పాల్గొన్న జిల్లా ఇంటర్నల్‌ స్క్వాడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి : నకిలీ విత్తనాలు విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా అధికారులతో పాటు ప్రత్యేక బృందాలతో ఫర్టిలైజర్‌ షాపుల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. బుధవారం తాండూరు పట్టణంలో జిల్లా ఇంటర్నల్ స్క్వాడ్ అధికారులు, వికారాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్ కుమార్, తాండూరు ఏడీఏ రుద్రమూర్తిల బృందం తనిఖీలు నిర్వహించారు.

తాండూరు పట్టణంలోని రవిరాజ్, కావేరీ, సాయిరాం, హనుమాన్, మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపులతో పాటు ట్రాన్స్ఫోర్ట్ ఏజేన్సీలు ఎస్ఆర్ఎంటీ, నవత, సప్తగిరి, క్రాంతి ట్రాన్స్పోర్టులలో తనిఖీలు నిర్వహించారు. ఆయా షాపులు, ట్రాన్స్ పోర్టులలో విత్తనాలకు సంబంధించిన రికార్డులను, ధరల పట్టికలను పరిశీలించారు. అదేవిధంగా ధరల పట్టికలను బోర్డులపై రాసి ఉంచాలని వ్యాపారులకు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు తప్పక అందించాలని అన్నారు. రసీదులో విత్తనాల లాట్ నెంబర్, కొనుగోలు చేసిన రైతు పేరు, తండ్రి, ఊరు పేరు, ఫోన్ నెంబర్లు నమోదు చేయాలన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

అదేవి ధంగా రైతులు కూడా ఫర్టిలైజర్ షాపుల నుంచి రసీదులు తప్పక పొందాలన్నారు. రసీదులను పంట కాలం ముగిసే వరకు దాచుకోవాలని, ఒకవేల విత్తనాలు నకిలీ అని తేలితే పరిహారం పొందేందుకు వీలు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో తాండూరు వ్యవసాయ అధికారిణి రజిత, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఆర్యవైశ్య ఆణిముత్యం..!