భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలు
– సామూహిక ప్రార్థనలలో పాల్గొన్న వేలాది ముస్లిం సోదరులు
– శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో వైభవంగా రంజాన్ పండుగను శనివారం భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాస దీక్షల అనంతరం ఈద్-ఉల్-పితర్ గా పిలుచుకునే రంజాన్ పండుగ సందర్భంగా పట్టణ సమీపంలోని చెన్ గెసేపూర్ రోడ్డు మార్గంతో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు వేల సంఖ్యల్లో పాల్గొని అందరికి మంచి జరగాలని సామూహిక ప్రార్థనలు చేశారు. పండుగలోని ప్రధానంగా చెప్పుకునే జకాత్‌ను దృష్టిలో ఉంచుకుని పేదవారికి డబ్బులు దానం చేశారు. ఇక మహిళలు ఇంట్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పండగను పురుస్కరించుకుని సన్నిహితులకు ఇంట్లోకి పిలిచి ప్రత్యేక వంటకాలను రుచిచూపించారు. పండుగ ప్రత్యేకమై షీర్ కుర్మాను తాగించారు. ప్రశాంత వాతావరణంలో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
ముస్లిం సోదరుల రంజాన్ పండుగ సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

సామూహిక ప్రార్థనలు చేసే ఈద్గాల వద్దకు చేరుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీసీ కమీషనర్ మెంబర్ శుభప్రద్ పటేల్, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మైనార్టీ నేతలు తదితరులతో కలిసి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈద్గా కమిటి అభివృద్ధికి తోడ్పాటు: ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
అనంతరం ఈద్గాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం సోదరులు కోరిన విధంగా ఈద్గాల అభివృద్ధితో పాటు హైదరాబాద్ రోడ్డు మార్గంలో, పాత తాండూరులో స్మశాన వాటికకు స్థలం కేటాయించేలా కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి అధ్యక్షులు యూసుఫ్ ఖాన్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ సీనీయర్ పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్, సీపీఐ నాయకులు జనార్దన్ రెడ్డి, విజయలక్ష్మీ పండిత్, యూత్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ కుమార్, ఎంఐఎం నాయకులు హాది, మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ, మైనార్టీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

