గల్లి గల్లీకి పైలెట్ ముహూర్తం ఫిక్స్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

గల్లి గల్లీకి పైలెట్ ముహూర్తం ఫిక్స్‌
– రేపటి నుంచి వార్డు వార్డుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– పర్యటనను విజయవంతం చేయాలన్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గల్లి గల్లీకి పైలెట్ కార్యక్రమానికి మూహూర్తం ఫిక్స్ అయ్యింది. శుక్రవారం నుంచి తాండూరు మున్సిపల్‌ పరిధిలో కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు గురువారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం పట్టణంలోని 8వ, 7వ, 6వ, 5వ, 4వ 3వ, 2వ, 1వ వార్డులతో పాటు 24వ, 25వ, 23వ, 26వ, 22వ, 20వ, 19వ, 21వ, 33వ, 32వ, 31వ వార్డులలో పర్యటించనున్నట్లు పక్రటించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు వార్డుల్లోని గల్లి గల్లీకి పైలెట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పర్యటించనున్నారు.

దీంతో ఎమ్మెల్యే పర్యటనపై ఆయా వార్డుల కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే పర్యటనలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.