28 ట్రైన్స్ క్యాన్సల్..!
– నేటి నుంచి వారం పాటు
– ప్రకటించిన దక్షణ మద్య రైల్వే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దక్షణ మద్య రైల్వే శాఖ పరిధిలో నేటి నుంచి పలు ట్రైన్స్ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆశాఖ ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో నిర్వహణ పనులు చేపడుతున్న నేపథ్యంలో 28 రైళ్లను ఈ నెల 19- 25 వరకు పూర్తిగా, మరో ఆరింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రద్దయిన వాటిలో కాజీపేట-డోర్నకల్-కాజీపేట, డోర్నకల్-విజయవాడ-డోర్నకల్, భద్రాచలంరోడ్-విజయవాడ-భద్రాచలంరోడ్, సికింద్రాబాద్-వికారాబాద్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్, కరీంనగర్-నిజామాబాద్-కరీంనగర్, కాచిగూడ-నడికుడి-కాచిగూడ తదితర రైళ్లు ఉన్నాయి. ఈ ట్రైన్స్ క్యాన్సల్ కావడంతో నిర్దేశిత కాలం వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి….


