మనసుతో.. విందాం.. వీక్షిద్దాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మనసుతో.. విందాం.. వీక్షిద్దాం..!
– మన్‌కీ బాత్‌ను జయప్రదం చేయండి
– బీజేపీ తాండూరు అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ ప్రధాని మోడీ ప్రతినెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పండగలా జరుపుకుందామని బీజేపీ తాండూరు నియోజకవర్గ అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్ తెలిపారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఈనెల 30న ఆదివారం ప్రధాని మోడి చేపట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్ కు చేరుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 10వేల చోట్ల మన్ కీ బాత్ వీక్షించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో 100 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కావున బీజేపీ ప్రజా ప్రతినిధులు, బూత్ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు, మోడీ అభిమానులు మన్ కీ బాత్ కార్యక్రమంలో 100 మందితో పాల్గొని పండగలా వీక్షించాలని పిలుపునిచ్చారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా మోడిపై అభిమానాన్ని చాటుకోవాలన్నారు.