లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించాలి
– ఉచిత ఎంసెంట్ కోచింగ్ అభినందనీయం
– బీసీ కమీషన్ మెంబర్ శుభప్రవద్ పటేల్
– విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు తమ ఉన్నత లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించి సాధించుకోవాలని తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. శుక్రవారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సమద్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. వాటిని సాధించుకునేందుకు పట్టుదలతో శ్రమించాలన్నారు. ఎంసెట్ తో పాటు పోటీ పరీక్షలలో సత్తా చాటాలన్నారు.
అదేవిధంగా పేద విద్యార్థుల కోసం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఉచితంగా ఎంసెట్ కోచింగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఖాలేద్ షఫీ ఉల్లా, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, నాయకులు అజార్, అబ్దుల్ సలీం, అబ్దుల్ మజీద్, అబ్దుల్ సలీం, సాజిద్, అసద్, ఉస్మాన్ గనీ, అద్యాపకులు పర్యాద రామకృష్ణ, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు శ్రీశైలం, భాను, బాలు యాదవ్, విజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

