హైకోర్టు సమీపంలో వ్యక్తి దారుణ హత్య
– రూ. 10 వేల కోసం ఘాతుకం
– అందరు చూస్తుండగా కత్తితో పోట్లు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు సమీపంలో దారుణ హత్య జరిగింది. గురువారం హైకోర్టు గేట్ నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు అందరు చూస్తుండగానే కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ చార్మినర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైకోర్టు గేట్ నెంబర్ 6 వద్ద మిథున్ అనే వ్యక్తితో పాటు నిందితుడు రూ.10 వేల కోసం ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోధ్రిక్తుడైన నిందితుడు మిథున్‌ను అందరూ చూస్తుండగానే కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. దీనితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించిన పోలీసులు.. మృతి చెందిన వ్యక్తిని స్థానికంగా ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న మిథున్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది.

