ఫైలెట్‌ ఆదరణకు ఓర్వలేక..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఫైలెట్‌ ఆదరణకు ఓర్వలేక..!
– బీఆర్ఎస్ పార్టీని బద్నామ్ చేసేందుకు కుట్ర
– ఎమ్మెల్సీ పార్టీ పిరాయింపుకు యత్నం
– ఎమ్మెల్యే టిక్కెట్టు పైలెట్‌ రోహిత్ రెడ్డికే
– రాద్దాంతం కోసమే ఎమ్మెల్సీ వర్గం విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్‌ పార్టీని బద్నామ్ చేయడానికి ఎమ్మెల్సీ వర్గం నేతలు కుట్రలు చేస్తున్నారని తాండూరు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే వర్గం నేతలు అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని రెచ్చగొట్టేందుకు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ వర్గం చేసిన ఆరోపణలను వారు ఖండించారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కౌన్సిలర్ విజయాదేవి తదితరులు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లే ఎమ్మెల్యేపై అనవసరమైన విమర్శలు చేసి రాద్దాంతం చేస్తున్నారని అన్నారు. మహేందర్ రెడ్డిపై గౌరవముందని చెప్పుకొస్తూ.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని రెచ్చగొట్టి ఆయన పార్టీ పిరాయించేలా కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీనిని అడ్డంగా పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీనీ బద్నామ్ చేస్తున్నారని అన్నారు. మహేందర్ రెడ్డితోనే తాండూరు అభివృద్ధి జరిగిందని చేస్తున్న సవాల్‌కు ప్రతి సవాల్ చేస్తున్నామని, అభివృద్ధిపై చర్చకు సిద్దమన్నారు. ఎక్కడికైనా వస్తామని సవాల్‌ చేశారు. మహేందర్ రెడ్డిని మభ్య పెట్టే నేతల ఆటలు సాగవన్నారు. మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉంటారని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ ఓర్వలేక రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.

ఎమ్మెల్యేతోనే తాండూరు అభివృద్ధి
ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిధులు సాధించినా వాటి పురోగతికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు తాండూరు వెనుకబాటుకు పరోక్షంగా కుట్ర చేశారని అన్నారు. తాండూరులో కాకుండా జిల్లాలో మూడు ఇంజనీరింగ్ కళాశాలలు కట్టించారని, వికారాబాద్ – తాండూరుకు రూ. 55 కోట్లతో రోడ్డు మంజూరైతే విభజించి అడ్డుకున్నారని, అంతేకాకుండా జిల్లా విభజన సమయంలో శంకర్‌ పల్లిని వికారాబాద్‌ జిల్లాకు కాకుండా కుట్ర చేశారని వ్యగంగా విమర్శించారు. కాని రోహిత్ రెడ్డి తాండూరుకు నర్సింగ్ కాలేజీ, పారిశ్రామిక వాడా, తాండూరు మార్కెట్ యార్డుకు 30 ఎకరాలు, ఆటో నగర్‌కు 12 ఎకరాలు, మార్కెట్ యార్డు భవనానికి రూ. 12 కోట్లు నిధులు తీసుకవచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధి, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.

పార్టీ కోసమే బీజేపీ భరతం
బీఆర్ఎస్ పార్టీ కోసమే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కొనుగోలు చేసేందుకు వచ్చిన బీజేపీ నాయకుల బృందాన్ని అడ్డంగా పట్టించారని గుర్తుచేశారు. పార్టీ కోసం ఎమ్మెల్యే ఏం చేశారని అనే వాళ్లు ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ఎమ్మెల్యే టిక్కెట్టు అని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటన చేశారని తెలిపారు. తాండూరు టిక్కెట్టు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ విడిచి వేళ్లే వాళ్లు భేషరతుగా వెళ్లి పోవచ్చన్నారు. లేదంటే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి రావాలని సూచించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని బద్నామ్ చేసే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.

అవినీతి చైర్ పర్సన్
తాండూరు మున్సిపల్‌లో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అవినీతి కీర్తిని మూటకట్టుకున్నారని విమర్శించారు. మున్సిపల్‌లో బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్‌, డబ్బులతో పాటు చిలక వాగు పనుల నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ వర్గం అని కాకుండా చైర్ పర్సన్‌, కౌన్సిలర్లకు సమాచారం అందించినా ఎమ్మెల్యే కార్యక్రమాలకు హాజరు కావడం లేదని అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ వచ్చినా కూడా ఎమ్మెల్సీ వర్గం నేతలు కూడా రాలేదని అన్నారు. ఎమ్మెల్యేపై గౌరవం లేకపోవడంతోనే కార్యక్రమాలకు రాకుండా వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్‌, ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, యువ నాయకులు చంటి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.