గౌరవానికి వన్నె తీసుకొస్తా
– గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్కు ఘన సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకం తరువాత అందరు చూపిస్తున్న గౌరవానికి వన్నె తీసుకవస్తానని చైర్మన్ రాజుగౌడ్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రాజుగౌడ్ను తాండూరు రజక సంఘం, రజక ఉపాధ్యాయ సంఘం సభ్యులు ఆయన నివాసంలో వారు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయా సంఘాల సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియామకం అయిన రాజుగౌడ్ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ తాండూరు ప్రజలు తనపై చూపిస్తున్న గౌరవ, మర్యాదలు మరువలేనివన్నారు. వారి నమ్మకానికి అనుగుణంగా గౌరవానికి వన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పి.కృష్ణ, రజక, ఉపాధ్యాయ సంఘం నాయకులు నాగప్ప, ఆయా సంఘాల సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు శనివారం రాజుగౌడ్కు యాలాల మండలంలో కూడ టీఆర్ ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.



