పట్నం పెండ్లి కూతురుకి సీఎం ఆశీర్వాదం

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

పట్నం పెండ్లి కూతురుకి సీఎం ఆశీర్వాదం
– మహేందర్ రెడ్డి కూతురు వివాహానికి హాజరైన కేసీఆర్
– పెళ్లికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డిల కూతురు మనీషా రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదాలు లభించాయి. ఆదివారం హైదరాబాద్‌లోని ఏఎంఆర్ ఆరేనా గార్డెన్‌లో మనిషా రెడ్డి వివాహాము హిమదీప్‌తో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహా వేడుకకు సీఎం కేసీఆర్ హాజరై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డిలతో కలిసి ఆశీర్వదించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పెండ్లి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరోవైపు వికారాబాద్‌ తో పాటు తాండూరు నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లి కొత్త జంటను ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి…
హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..!
– వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు
– కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
https://dharshininews.com/17144