పట్టణ రహదారులకు రాజయోగం

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణ రహదారులకు రాజయోగం
– తాండూరు రోడ్ల అభివృద్ధికి రూ. 25 కోట్లు
– జీఓ 217ను జారీ చేసిన ఆర్అండ్‌బీ
– ఫలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృషి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ప్రధాన రహదారులకు రాజయోగం పట్టబోతోంది. పట్టణంలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్అండ్ బీ శాఖ ద్వారా జీఓ 217ను జారీ చేసింది. ఇప్పటికే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్ హెచ్ ఏ ఐ) కింద తాండూరు పట్టణంలోని ప్రధాన రోడ్లను రూ.23 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తాజాగా మంజూరు చేసిన నిధులతో తాండూరు పట్టణంలోని బస్టాండ్ నుంచి పెయింట్ మార్క్స్ హై స్కూల్ వరకు రోడ్డుకు ఇరువైపులా మిగిలిపోయిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు పుట్ ఫాట్ నిర్మాణం, పట్టణ సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఈ మొత్తం పనులను ఆర్ అండ్ బి శాఖ పర్యవేక్షణలో జరుగుతాయి. కొత్తగా మంజూరు అయిన నిధులతో రోడ్లకు మహర్దశ రాబోతోంది. మరోవైపు పట్టణంలోని ప్రధాన రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ తో పాటు ఆర్ అండ్ బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ప్రధాన రోడ్లను అభివృద్ధి పరచడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి…
హాఫ్ షర్ట్, టీ షర్టుతో బైకు నడిపితే..!
– వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు
– కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
https://dharshininews.com/17144