రెచ్చిపోయిన.. గొలుసు దొంగలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రెచ్చిపోయిన.. గొలుసు దొంగలు..!
– తాండూరులో మహిళ మెడలో బంగారం చోరీ
– మరో మహిళ నుంచి దోపిడికి యత్నం
– సీసీ పుటేజీలో దొంగల చిత్రాలు రికార్డు
– ఆఖరిలో సూపర్‌ ట్విస్ట్.. తెలిస్తే షాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులో చైన్ స్నాచర్స్‌(గొలుసు దొంగలు) రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని దోపిడికి పాల్పడ్డారు.

ఈ సంఘటన తాండూరు పట్టణంలో కలకలం రేపింది. తాండూరు పట్టణంలో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వాలిపోయారు. పట్టణ పరిధిలోని కోకట్‌ రోడ్డు మార్గంలో వాకిట్లో పనులు చేస్తున్న శ్యామమ్మ అనే మహిళ మెడలో నుంచి సుమారు 3తులాల గొలుసును దోచుకెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని ఆదర్శనగర్‌ నుంచి ఒంటరిగా డ్యూటీకి వెళుతున్న ఆర్టీసీ మహిళ కండక్టర్‌ మెడలో గొలుసును లాక్కునేందుకు యత్నించారు.

ఆమె కేకలు వేయడంతో స్థానికులు వస్తారేమో అనే భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. తాండూరులో తిరిగిన ముగ్గురు దొంగల చిత్రాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ పుటేజీలలో రికార్డు అయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరోవైపు నిందితులపై నిఘా ఉంచగా నిందితులు ముగ్గురు కాదు.. నలుగురు అని తేలింది. ఈ నిందితులు మోయినాబాద్‌ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

ప్రజా పాలనలో రైతులకు శాపం